ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (17:55 IST)

అల్లు అర్జున్‌ లగ్జరీ ఇంటి పేరు "బ్లెస్సింగ్".. నెట్టింట వైరల్

Allu Arjun
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడైన, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ లగ్జరీ ఇల్లు కట్టించుకున్నాడు. ఈ ఇంటి గురించి ప్రస్తుతం నెట్టింట చర్చ సాగుతోంది. 
 
పుష్పతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న బన్నీ లగ్జరీ ఇల్లుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 
 
ఇకపోతే.. హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ ఇంటి పేరు 'బ్లెస్సింగ్'. రెండు ఎకరాల స్థలంలో 8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 100 కోట్ల రూపాయలతో విలాసవంతంగా అల్లు అర్జున్ ఈ ఇంటిని తన టేస్ట్‌కు తగ్గట్టుగా నిర్మించుకున్నాడు. 
 
పూర్తిగా సహజమైన తెలుపు రంగుతో పెయింటింగ్‌ చేసిన ఈ ఇంటి లోపల పెద్ద స్విమ్మింగ్‌ ఫూల్‌, జిమ్‌, హోమ్‌ థియేటర్‌, స్పెషల్‌ పార్టీల కోసం బార్‌ జోన్‌, పిల్లల కోసం ప్లేయింగ్‌ ఏరియా ఉంది. 
 
అలాగే ఏడు కోట్ల రూపాయలతో అత్యంత విలాసవంతమైన వ్యాన్‌ను ఆయన సొంతం. దీనిని ఫాల్కాన్ అని పిలుచుకుంటారట. ఇంకా తన ఇంటికి సంబంధించిన ఫొటోలను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.