ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (16:03 IST)

రొమాంటిక్ టూర్ కోసం ఫిన్‌లాండ్ వెళ్ళిన ఉపాస‌న‌

Upasana, Ram Charan
ఒక‌రు సినిమా హీరో, మ‌రొక‌రు ఆసుప్ర‌తి వ్య‌వ‌హారాల‌తోపాటు సామాజిక సేవ‌లు చేసే మ‌హిళ‌. ఇద్ద‌రూ భార్య‌బ‌ర్త‌లు. వారే ఉపాస‌న‌, రామ్ చ‌ర‌ణ్‌. ఇద్ద‌రూ విధి నిర్వ‌హ‌ణ‌లో చాలా బిజీగా వుండ‌డంతో ఏకాంతంగా వుండ‌డానికి త‌క్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారు. అందుకే అప్పుడ‌ప్పుడు అలా విహార యాత్ర‌ల‌కు వెళుతుంటారు. ఈసారి మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా త‌గు స‌మ‌యం కేటాయించి ఇరువురూ ఫిన్‌లాండ్ వెళ్ళారు.
 
ఈ విష‌యాన్ని ఉపాస‌న త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫిన్‌లాండ్‌లో ప్ర‌స్తుతం మంచు కాలం. అక్క‌డ పూర్తిగా మంచుతో క‌ప్ప‌బ‌డిన రోడ్లు, చెట్లు క‌నిపిస్తున్నాయి. ఆ ఫొటో పోస్ట్ చేస్తూ, ఇది పని నుండి విరామం తీసుకొని కుటుంబంతో విహారయాత్రకు వెళ్లడానికి సమయం ఆసన్నమైంది,   సెలవుల కోసం రొమాంటిక్ టూర్‌ ఫిన్‌లాండ్‌కు వెళ్ళామ‌ని పేర్కొంది. త్వ‌ర‌లో ఆ ఇద్ద‌రు ముగ్గురు అయితే అటు కుటుంబంలోనూ ఇటు అభిమానుల్లోనూ సంతోషం వెల్లివిరిస్తుంది.