గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 మార్చి 2022 (09:27 IST)

ఆలియా భ‌ట్‌తో క‌లిసి చెర్రీ కొత్త ప్రకటన

parle
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త ఉత్పత్తికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భ‌ట్‌తో క‌లిసి చెర్రీ కొత్త వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో క‌నిపించ‌నున్నాడు. భార‌త బీవ‌రేజెస్ ఉత్ప‌త్తుల్లో అగ్ర‌గామిగా ఉన్న పార్లే అగ్రో సంస్థ ఉత్ప‌త్తి అయిన ఫ్రూటీకి చెర్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. 
 
ఇప్ప‌టికే ఫ్రూటీకి ఆలియా భ‌ట్ ప్రచార‌క‌ర్త‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అలియాతో క‌లిసి చెర్రీ త‌మ బ్రాండ్‌కు ప్ర‌చారం చేయ‌నున్న‌ట్లుగా పార్లే ఆగ్రో తెలిపింది. అలాగే జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ఆలియాల‌తో క‌లిసి చెర్రీ.. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త్వ‌రలోనే విడుద‌ల కానుంది.