గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (08:38 IST)

రామ్ చ‌ర‌ణ్ షూటింగ్‌కు వార్నింగ్!

Ramcharn-Sankar poster
తాజాగా  రామ్‌చరణ్‌ హీరోగా  పాన్‌ ఇండియా ఫిల్మ్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శంకర్‌ దర్శకత్వం వ‌హిస్తున్నారు. స‌హ‌జంగా శంక‌ర్ సినిమా షూటింగ్ చేస్తే చుట్టు ప‌క్క‌ల మీడియానుకూడా అనుమ‌తించ‌మంటూ బోర్డ్ పెడుతుంటారు. రాజ‌మౌళి ఇలాంటివి చేస్తుంటారు. ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌కూడా అలాగే చేయాల్సి వ‌చ్చింది. కార‌ణం ప‌బ్లిక్‌లో ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి రావడ‌మే అందుకు కార‌ణం.ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌. 
 
ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌ రాజమండ్రిలో జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్‌లో చరణ్, కియారాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పూణే షెడ్యూల్‌ తర్వాత కొంతగ్యాప్‌ తీసుకున్న చరణ్‌ మళ్లీ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో సినిమా షూటింగ్ సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న అంశాలు ఎక్కువ కావడంతో ఈ విషయం మీద సినిమా నిర్మాణ సంస్థ షాకిచ్చింది. 
 
రామ్ చ‌ర‌ణ్ 15 అనే వ‌ర్కింగ్ టైటిల్ పెట్టిన ఈ సినిమా షూటింగ్ క‌థ‌కు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో జనసందోహం మధ్య జరుగుతోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, చట్టవిరుద్ధంగా తీసిన షూటింగ్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలని మేము అభ్యర్థిస్తున్నాం అంటూ మైక్‌లో చెబుతూ, ఆ ప‌రిస‌ర ప్రాంతాల్లో బోర్డులు కూడా పెట్టారు.
 
ఇక‌, అనధికారిక కంటెంట్‌ను పోస్ట్ చేసే ఐడీలపై మా యాంటీ పైరసీ టీమ్ యాక్షన్ తీసుకుంటుంది” అని చిత్ర యూనిట్ పేర్కొంది. శ్రీకాంత్, నవీన్‌ చంద్ర, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ‘దిల్‌’రాజు, శిరీష్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు హర్షిత్‌ రెడ్డి సహ నిర్మాత. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నారు.