శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (22:43 IST)

భోళాశంకర్‌తో రంగమ్మత్త..

యాంకర్‌గా అదరగొడుతూ, సినిమాల వైపు దృష్టి మరలించి రాణిస్తున్న అనసూయ రంగస్థలం సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆరంభంలో స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన అనసూయ, ఆ తరువాత ముఖ్యమైన పాత్రలపై దృష్టిపెట్టింది.  
 
తాజాగా పుష్ప సినిమాలో పోషించిన దాక్షాయణి పాత్ర .. ఖిలాడి సినిమాలో చేసిన చంద్రకళ పాత్రలు ఆమెకి మరింత మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇక చిరంజీవి 'ఆచార్య' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన అనసూయ, మరోసారి ఆయన సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వస్తున్నాయి.
 
మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి 'భోళాశంకర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా పట్టాలెక్కేసింది. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ కోసం అనసూయను తీసుకున్నారని అంటున్నారు.