శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (23:28 IST)

యాంకర్ అనసూయ గ్లామర్ అదుర్స్... టాప్ హీరోయిన్లకే పోటీగా...

హాట్ యాంకర్ అనసూయ గురించి పెద్ద పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షోతో తానేంటో నిరూపించుకుని ఆ తరువాత సినిమాల్లోను రాణిస్తూ అటు బుల్లితెర, ఇటు వెండితెరలపై దూసుకుపోతోంది అనసూయ. అనసూయకు పెళ్ళయి పిల్లలున్నారు. భర్త భరద్వాజ్. మొదట్లో అందాల ఆరబోసేందుకు ఏ మాత్రం ఒప్పుకోని అనసూయ ఇప్పుడు అందాలను ఆరబోయడమే పనిగా పెట్టుకుంది.

 
తాజాగా ఆమె రవితేజతో నటించిన ఖిలాడి మూవీలో కూడా అందాలను బాగా ఆరబోసిందట. ఇందులో డబుల్ రోల్ చేస్తోందట. ఒకటి రెబల్ పాత్ర అయితే మరొకటి బ్రాహ్మణ మహిళగా నటిస్తోందట.

 
అయితే ఇందులో ఆమె అందాలను ఆరబోసే క్యారెక్టర్ చేసిందట. ఈ సినిమాలోని కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయట. దీన్ని చూసిన నెటిజన్స్ ఎవరికి తోచినట్లు వారు కామెంట్లు కొడుతున్నారట. ఐతే ఇవన్నీ యాంకర్ అనసూయ పెద్దగా పట్టించుకోవడంలేదట. కారణం... సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఆరబోత మామూలే కదా.