సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (15:59 IST)

యాంకర్ అనసూయ ప్రెగ్నెన్సీ? ఈసారి కూతురే కావాలట..?

హాట్ యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షోతోనే ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో పాటు రామ్ చరణ్ అత్తగా నటించి మంచి పేరునే తెచ్చుకున్నారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా జబర్దస్త్ ఒక్కటి మాత్రమే ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
 
అయితే ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న అనసూయ మళ్ళీ ప్రెగ్నెన్సీగా ఉందట. ఈ విషయాన్ని ఆమే చెప్పింది. సమయానికి తినాలి. మామిడి పళ్ళను ఎక్కువగా తినాలంటూ ఈ మధ్య స్కిట్ నుంచి బయటకు వచ్చి అభి చెప్పగానే అందుకు ఇంకా సమయం ఉంది. 
 
నాకు కూతురే కావాలి. కూతురు కోసం ఎంత సమయమైనా కేటాయిస్తానంటూ అనసూయ చెప్పిందట. దీంతో ఒక్కసారిగా స్కిట్ లోని వారందరూ షాకయ్యారు. తాను గర్భవతి అన్న విషయాన్ని అనసూయే స్వయంగా చెప్పడంతో అందరూ నిర్థారించుకున్నారట. 
 
ఆరునెలల తరువాత ఆమె షోకి కూడా వచ్చే అవకాశం లేదట. తాత్కాలికంగా షోకు దూరంగా ఉండాలన్న ఆలోచనలో ఉందట అనసూయ. ఈ విషయాన్ని నిర్వాహకులకు కూడా చెప్పేసిందట. ఇక అనసూయ లేకుంటే రష్మి ఒక్కటే కదా ఆ షోకు దిక్కు.