బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 9 జులై 2021 (13:10 IST)

సినిమా యాంక‌రింగ్ చేస్తూనే మ‌స్కా! కిలాడి అన‌సూయ‌...

ఎర్ర‌గా, బుర్ర‌గా ఉండే అన‌సూయ‌ను చూస్తే, సామాన్య ప్రేక్ష‌కుల‌కే కాదు... యంగ్ హీరోల‌కు కూడా గుబులే. అయిదున్న‌ర అడుగుల ఎత్తు... చ‌బ్బీ ఫేస్, మిల్క్ వైట్ రంగుతో మురిపించే అన‌సూయ‌... ఇప్ప‌టికే బుల్లి తెరలో యంక‌ర్ గా హైలైట్ అయింది. జ‌బ‌ర్ద‌స్త్ ఎపిసోడ్ ల‌ను చాలా మంది కుర్ర‌కారు, మ‌ధ్య వ‌య‌స్కులు కామెడీ కోసం కాదు... అన‌సూయ యాంక‌రింగ్, వెరైటీ డ్రెసింగ్ కోసం చూస్తార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. 
 
అదే యాంక‌రింగ్ ని అడ్డం పెట్టుకుని, అన‌సూయ అంచెలంచెలుగా టాలీవుడ్ లోనూ త‌న‌దైన ముద్ర వేస్తోంది. ఇప్ప‌టికే రంగ‌మ్మ‌త్త‌గా రామ్ చ‌ర‌ణ్ సినిమా రంగ‌స్థ‌లం లో ఒక ఊపు ఊపిన అన‌సూయ‌... ఇపుడు తాజాగా పుష్ప సినిమా షూటింగ్ సెట్స్ పైకి వ‌చ్చేసింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేష‌న్లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న పుష్ప‌ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అన‌సూయ‌. సుకుమార్ సినిమాలో ఇది అన‌సూయ‌కు రెండో ఛాన్స్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం అవుతుండ‌టంతో... అన‌సూయ భ‌ర‌ధ్వాజ్ కూడా త‌న రేంజ్ పెరిగిపోయిన‌ట్లే అంటోంది. ఎందుకంటే, ఇందులో అన‌సూయ‌ది కీ రోల్ అట‌. 
 
ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న మెయిన్ హీరోయిన్. అయితే, ర‌ష్మిక‌ను అన‌సూయే డామినేట్ చేసేస్తుంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అంటున్నాయి. ఎందుకంటే, ర‌ష్మిక యంగ్ అయినా, హైట్ త‌క్కువ‌. పైగా, అన‌సూయ అంత హొయ‌లు ఒలికించ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదంటున్నారు ఆమె అభిమానులు.
 
ఇక అన‌సూయ‌కు ఇలా వ‌ర‌స‌పెట్టి సినిమా ఛాన్సులు రావ‌డానికి ఒక కార‌ణం... ఆమె యాంక‌రింగేన‌ట‌. సినిమా ఫంక్ష‌న్ల‌కు యాంక‌రింగ్ చేసేట‌పుడే అన‌సూయ యంగ్ హీరోల‌కు, ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మ‌స్కా కొట్టేస్తుంద‌ట‌. వ‌చ్చే సినిమాలో నాకు ఛాన్స్ ఇస్తారుగా...అంటూ వేదిక‌ల‌పై నుంచే న‌వ్వుతూ, ఆఫ‌ర్ కోసం అప్లికేష‌న్ పెట్టేస్తుంది అన‌సూయ‌. వంద‌ల మంది ప్రేక్ష‌కుల మ‌ధ్య అన‌సూయ అలా ప‌బ్లిక్ గా అడిగే స‌రికి... సినీ పెద్ద‌లు మ‌రి కాద‌న‌లేక‌... అన‌సూయ‌ను చూసి ...ఓకే అనేస్తున్నార‌ట‌. ఎంతైనా అన‌సూయ టాలెంట్ ని మెచ్చుకోకుండా ఉండ‌లేరు క‌దా!