సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 మే 2021 (12:09 IST)

అబార్షన్ చేయించుకున్న ఇలియానా : క్లారిటీ ఇచ్చిన గోవా బ్యూటీ!

గోవా బ్యూటీ ఇలియానా... గతంలో అండ్రూ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నది. ఆ సమయంలో వారిద్దరూ శారీరకంగా కలుస్తూ వచ్చారు. ఫలితంగా ఇలియానా గర్భందాల్చిందనీ, దీంతో ఆమె అబార్షన్ చేయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. వీటిపై ఇలియానా తాజాగా క్లారిటీ ఇచ్చారు. 
 
'గత కొన్ని సంవత్సరాల క్రితం ఆండ్రూ అనే వ్యక్తితో నేను రిలేషన్‌లో ఉన్న మాట నిజమే. ఈ విషయం అందరికీ తెలిసిందే. కొన్ని వ్యక్తిగత కారణాలతో పరస్పర అంగీకారంతో మేమిద్దరం 2019లో విడిపోయాం. అయితే, మేమిద్దరం రిలేషన్‌లో ఉన్న సమయంలో నేను గర్భం దాల్చానని, అలాగే అబార్షన్‌ చేయించుకున్నానని ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అవన్నీ అబద్ధం. ఆ వార్తలు కేవలం అవాస్తవాలు మాత్రమే. వాటిలో రవ్వంత కూడా నిజం లేదు.'
 
'ఆండ్రూతో నేను విడిపోయిన సమయంలో అందరిలానే నాకు కూడా ఎంతో బాధగా అనిపించింది. అదేసమయంలో నేను ఆత్మహత్యకు పాల్పడ్డానని అందరూ చెప్పుకున్నారు. నేను బలవన్మరణానికి పాల్పడుతుంటే నా పనిమనిషి నన్ను ఆపిందని.. ఆమె వల్ల నేను ప్రాణాలతో ఉన్నానని అప్పట్లో  పుకార్లు వినిపించాయి. నిజం చెప్పాలంటే నేను ఆత్మహత్య ప్రయత్నాలు అస్సలు చేసుకోలేదు. అలాగే అసలు నాకు పనిమనిషి అంటూ ఎవరూ లేరు. నా గురించి ఇలాంటి వార్తలు బయటకు రావడం చూసి వింతగా అనిపించింది' అని తనపై వచ్చిన రూమర్స్‌కు ఇలియానా క్లారిటీ ఇచ్చింది.