బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 సెప్టెంబరు 2021 (10:47 IST)

ఆది షర్ట్ విప్పిన యాంకర్ అనసూయ, ప్యాంటు కూడా విప్పుతానంటే...

యాంకర్ అనసూయ అంటే తెలియనివారుండరు. ఆమె అటు యాంకరింగ్ ఇటు సినిమాల్లో ఫుల్ బిజీ. అడుగు పెట్టిందంటే అక్కడ ఇక ఫుల్ కామెడీ స్టార్ట్ అవుతుంది. తాజాగా ఓంకార్ నిర్వహిస్తున్న సిక్త్ సెన్స్ షోలో ఇలాగే చేసింది అనసూయ.
 
ఆ షోకి గెస్టులుగా వచ్చి హైపర్ ఆది, అనసూయ తమదైన స్టైల్లో షోని రక్తి కట్టించారు. షోలో విసిరిన ఛాలెంజిలో హైపర్ ఆది ఓడిపోతాడు. దానితో కండిషన్స్ ప్రకారం ఆది చొక్కాను విప్పేసింది అనసూయ.
 
ఆ తర్వాత ప్యాంటు కూడా విప్పుతానని దగ్గరకు రావడంతో ఆది కాస్త జడుసుకుని దణ్ణం పెట్టేసాడు. దీనితో ప్యాంటును విప్పకుండా వదిలేసింది అనసూయ. ఈ షో మొత్తం ఆది షర్టు లేకుండానే వుండిపోయాడు.