గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (22:32 IST)

KVRK పోస్టర్‌లో సమంత, నయనతార, విజయ్ సేతుపతి..?

KVRK
సమంత, నయనతార, విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ (కెవిఆర్‌కె) టీజర్ ఫిబ్రవరి 11న విడుదల కానుంది. దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయడానికి ట్విట్టర్‌లో దర్శకుడు విఘ్నేష్ శివన్, సమంతా, నయనతార మరియు విజయ్‌ల చాలా హైప్ చేయబడిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇంకా టీజర్ ఈ నెల 11న, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
 
కొత్త పోస్టర్‌లో సినిమాలోని ముగ్గురు ప్రధాన నటీనటులు సమంత, విజయ్ మరియు నయనతార ఉన్నారు. ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా ఏప్రిల్‍‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించిన KVRK సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకుడు.