గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (08:18 IST)

నాకే కాదు.. నా భర్తకు కూడా సమంత చాలా హాట్‌గా కనిపించింది : ప్రియమణి

సినీ నటి ప్రియమణి సహచర నటి సమంతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకే కాదు తన భర్తకు కూడా సమంత చాలా హాట్‌గా కనిపించిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
"పుష్ప" చిత్రంలో సమంత ఓ ఐటమ్ సాంగ్‌లో నటించగా, ఆ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దీనిపై ప్రియమణి స్పందిస్తూ, బహుశా సామ్ కెరీర్‌లోనే ఇలాంటివి ఆమె చేసి ఉండకపోవచ్చని అన్నారు. ఈ పాటను చాలా మంది డౌన్‌లోడ్ చేసి, ఇప్పటికే రీల్స్‌ను తయారు చేసి ఉంటారని అనుకుంటున్నానని చెప్పారు.
 
ఇది నంబవర్ వన్ పాటగా నిలిచింది. ఇంత అద్భుతమైన పాటతో వచ్చినందుకు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌కు హ్యాట్సాఫ్. కొరియోగ్రఫీ చాలా అందంగా ఉంది అంటూ సామ్‌పై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. అదేసమయంలో హీరోయిన్ల విషయంలో ప్రేక్షకుల దృక్కోణం మారిందని ప్రియమణి అభిప్రాయపడ్డారు.