బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 డిశెంబరు 2021 (12:14 IST)

యాంకర్ అనసూయకు పితృవియోగం

బుల్లితెరకు చెందిన ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇంట ఆదివారం విషాదం చోటుచేసుకుంది. అనసూయ తండ్రి సుదర్శన్ రావు కన్నుమూశారు. హైదరాబాద్ నగరంలోని తార్నాకలో స్వగృహంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న అనేక మంది సినీ సెలెబ్రిటీలు అనసూయను ఓదార్చుతూ తమ సానుభూతిని తెలుపుతున్నారు.
 
సుదర్శన్ రావు ఒక వ్యాపారవేత్త. పక్కా కాంగ్రెస్ వాది. తన కుమార్తె అనసూయకు తన తల్లి పేరునే పెట్టుకుని మాతృమూర్తిపై అపారమైన ప్రేమను చూపించారు. తన కుమార్తెను ఆర్మీలోకి పంపించాలని సుదర్శన్ రావు భావించారు. కానీ ఆమె యాంకర్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమ పెళ్ళి చేసుకోవడంతో సుదర్శన్ రావు తన కుమార్తెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. కాగా, అనసూయ ఈ నెల 17వ తేదీన విడుదల కానున్న "పుష్ప" చిత్రంలో కీలక రోల్‌ను పోషించారు.