సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (09:01 IST)

టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల తండ్రి కన్నుమూత

టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన శ్రీను వైట్ల తండ్రి వైట్ల కృష్ణారావు తుదిశ్వాస విడిచారు. ఆదివారం వేకువజామున ఆయన మృతి చెందారు. ఈయనకు వయసు 83 యేళ్లు. దీంతో శ్రీనువైట్ల ఇంట్లో విషాదం నెలకొంది. 
 
తూర్పుగోదావరి జిల్లా కందులపాలెంలో నివసిస్తూ వచ్చిన కృష్ణారావుకు శ్రీను వైట్లతో పాటు మరో కుమార్తె ఉన్నారు. అయితే, సినిమాలో స్టార్ దర్శకుడుగా ఉన్న శ్రీను వైట్ల హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు. కానీ, ఆయన తండ్రి మాత్రం స్వస్థలంలో ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన కృష్ణారావు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మృతి చెందారు. ఈ విషయం తెలియగానే శ్రీను వైట్ల తన కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరుకు బయలుదేరి వెళ్లారు. వైట్ల కృష్ణారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.