గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 నవంబరు 2021 (13:33 IST)

దేవుడి హుండీలో డబ్బులెందుకు తీసావ్ బంగారం? తండ్రి మందలింపు: కూతురు ఆత్మహత్య

ముడుపు చెల్లించుకునేందుకు ఆ తండ్రి ప్రతిరోజూ దేవుడి హుండీలో డబ్బులు వేస్తున్నాడు. ఐతే ఆయన రెండో కుమార్తె ఏ అవసరం వచ్చిందో కానీ హుండీలో వేసిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని తీసుకుంది.

 
ఈ విషయం తెలిసిన ఆమె తండ్రి ఆగ్రహంతో ఆమెను మందలించాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన 13 ఏళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 
ఈ దారుణం గుత్తిలో జరిగింది. జెడ్.వీరా రెడ్డి కాలనీలో నివాసం వుంటున్న సుబ్బయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె బలవన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.