శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (11:32 IST)

తండ్రి వేధింపులు.. తట్టుకోలేక స్నేహితులతో కలిసి మట్టుబెట్టింది...

కామాంధుల అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తనను వేధించిన తండ్రిని స్నేహితులతో కలిసి అతడిని మట్టుబెట్టింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... బీహారుకు చెందిన దీపక్ కుమార్ సింగ్ (46).. 17 ఏళ్ల కుమార్తెను నిత్యం వేధించేవాడు. చెప్పుకోలేని స్థితిలో హింసకు పాల్పడేవాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక తండ్రిపై కక్ష పెంచుకుంది. 
 
ఈ వేధింపుల నుంచి బయటపడాలంటే తండ్రిని మట్టుబెట్టడమే మార్గమని నిర్ణయించుకుంది.  అతే ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు స్నేహితులను ఇంటికి పిలిపించింది.

అందరూ కలిసి మారణాయుధాలతో దీపక్ సింగ్‌పై దాడిచేసి పరారయ్యారు. దాడి సమయంలో ఆమె ఇద్దరు చెల్లెళ్లు కూడా అక్కడే ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న బాలిక, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.