ఆదివారం, 3 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 అక్టోబరు 2021 (21:57 IST)

అనసూయ డ్రెస్సింగ్‌పై కోట కామెంట్.. కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్

యాంకర్ అనసూయపై ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మంచి నటి, హావభావాలను చక్కగా పలికిస్తోంది అన్న కోటశ్రీనివాసరావు అనసూయ డ్రెస్సింగ్ మాత్రం తనకు నచ్చదని అది మారిస్తే ఇంకా బాగుంటుందని అన్నారు. 
 
ఈ నేపథ్యంలో లైవ్‌లో మాట్లాడుతూ అనసూయ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె బాధతో ఏడవడం లేదని స్ట్రాంగ్ ఎమోషన్ వల్ల అవి కళ్ళ నుండి వస్తున్న నీళ్లు మాత్రమే అని చెప్పిన అనసూయ కోటశ్రీనివాస్ రావుపై ఫైర్ అయ్యారు.
 
ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా ప్రతి ఒక్కరికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఆర్టిస్టులపై మిగతా వాళ్లు చేసే కామెంట్లు ఆ లిమిట్ దాటేస్తున్నాయని అనసూయ చెప్పారు. అది తమ ప్రొఫెషన్ అని దాంట్లో వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు అనే విషయం మీద వారి క్యారెక్టర్లను డిసైడ్ చేయకూడదని అది నేరమని అన్నారు. 
 
ఆర్టిస్ట్‌ల మీద కొందరు తోడేళ్ల లాగా మీద పడి పోతారు అని మీడియా మీద విరుచుకుపడిన అనసూయ కొంతమంది మంచి జర్నలిస్టులు ఉన్నప్పటికీ చాలా మంది మాత్రం యూట్యూబ్ కంటెంట్ కోసం చెత్త థంబ్ నైల్స్ పెట్టి వీడియోలు చేయడానికి ముందుంటారని అన్నారు. దయచేసి అలాంటి వాటిని నమ్మొద్దని ఆమె రిక్వెస్ట్ చేశారు.