గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (08:47 IST)

ప్రకాష్‌రాజ్ వచ్చాకనే 'మా'లో ఘర్షణ వాతావరణం: కోట శ్రీనివాసరావు

"ప్రకాష్‌రాజ్ వచ్చాకనే 'మా'లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.  మెగా ఫ్యామిలీలో చిరంజీవి లేకపోతే ఏమీ లేదు. ‘మా’ ఎన్నికల్లో మీ ఫ్యామిలీ నుంచి ఎవరినైనా నిలబెట్టాలని చిరంజీవికి స్పష్టంగా చెప్పా. ప్రకాష్‌రాజ్‌ను మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు.." అన్నారు కోట శ్రీనివాసరావు.
 
ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... " 'మా'పై తొందరపడి మాట్లాడుతున్నారని గతంలోనే చెప్పా. పోటీ పడుతున్నవారందరూ నాకు తెలిసినవారే. 'మా' ఎన్నికల్లో అర్హత ఉన్నవారే ఎవరైనా పోటీ చేయొచ్చు. షూటింగ్‌లలో ప్రకాష్‌రాజ్ సమయ పాలన పాటించేవారు కాదు.  ఆ విషయం ప్రొడ్యూసర్లకు తెలుసు.

నా హయాంలో 'మా' సభ్యులకు నా వంతు చేయాల్సింది చేశా. ఎవరో లోకల్, నాన్ లోకల్ అన్నారని కొట్టుకుంటున్నారు. ఏ కార్యవర్గ సమావేశానికి ప్రకాష్‌రాజ్ రాలేదు. టీవీల్లో వ్యాఖ్యలు చేయడం దేనికీ? ప్రజలేమైనా ఓట్లు వేస్తారా?

ప్రకాష్‌రాజ్ రెండు సార్లు 'మా'లో సస్పెన్షన్‌కు గురయ్యారు. ఏ అర్హతతో అధ్యక్షుడిగా పోటీచేస్తున్నావు? నేనెప్పుడూ ప్రకాష్‌రాజ్‌తో అగౌరవంగా మాట్లాడలేదు" అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మాలో చర్చనీయాంశంగా మారాయి.