ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (08:03 IST)

హుజురాబాద్ బైపోల్ : పోటీలో 61 మంది అభ్యర్థులు?

తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజైన శుక్రవారం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. మొత్తం 61 మంది అభ్యర్థులు 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 12 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా నామినేషన్‌‌ వేశారు. 
 
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చివరి గంటలో వచ్చి నామినేషన్ వేయగా.. ఆయన వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు ఈటల భార్య జమున కూడా నామినేషన్ వేశారు. మం
 
త్రి హరీశ్ రావు, కౌశిక్ రెడ్డిలతో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ వేశారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ వేశారు. 
 
నామినేషన్లు వేయడానికి శుక్రవారం కూడా భారీ సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు వచ్చారు. ఇన్ని రోజులు రూల్స్ అంటూ తమను అడ్డుకున్న పోలీసులు.. ఇతరుల విషయంలో మాత్రం వాటిని పాటించడం లేదని మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. 
 
అదే టైమ్‌లో మంత్రి హరీశ్ రావు అక్కడికి రావడంతో.. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కారులోనే మీడియా పాయింట్ వరకు వెళ్లిన హరీశ్ రావు.. అక్కడ మీడియాతో మాట్లాడిన తర్వాత మరో దారి గుండా వెళ్లిపోయారు.