1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Nizamabad : Two Minor Girls Assaulted

చాక్లెట్ల ఆశ చూపి నెల రోజులుగా మైనర్ బాలికపై అత్యాచారం... ఎక్కడ?

Nizamabad
తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ బాలికలను ఓ కామాంధుడు చెరిపాడు. చాక్లెట్ల ఆశ చూపి నెల రోజులు పాటు ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్​నగర శివారు కాలనీలో వసీం(30) అనే వ్యక్తి తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఈయన 8, 11 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు బాలికలకు చాక్లెట్ల ఆశ చూపి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ దారుణం నెల రోజులకుపైగా సాగింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
దేశంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని?