మంగళవారం, 13 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (16:40 IST)

గూడు లేనివారికి రూ.5 లక్షల నగదు : తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఓ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ గృహాలపై ఆయన ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ శుభవార్తను కూడా వెల్లడించారు. సొంత స్థలం వుండి, ఇల్లు లేని వారికి త్వరలోనే ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇచ్చేలా పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. 
 
అలాగే, ప్రభుత్వ అధికారులు జరిపిన సమగ్ర సర్వేలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల కోసం 26,31,739 దరఖాస్తుల రాగా.. ఇప్పటివరకు 2.91 లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేశామని గుర్తుచేసారు. ఇందులో ఇప్పటికే 2.27,000 ఇళ్లను ప్రారంభించినట్టు చెప్పారు. మరో 1,03,000 పూర్తి చేశామన్నారు. 70 వేల ఇండ్ల పనులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు.