టీవీ చూసేందుకు వచ్చిన 17 యేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం..
తెలంగాణా రాష్ట్రంలో మరో కామాంధుడు చేతిలో ఓ యువతి అత్యాచారానికి గురైంది. బాధితురాలి వయసు 17 యేళ్లుకాగా, అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి వయసు 65 యేళ్లు. ఈ దారుణం మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్‌లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 17 యేళ్ల బాలిక తన ఇంట్లో టీవీ చూడటానికి వచ్చిన సమయంలో 65 యేళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక అస్వస్థతకు గురికాగా వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారంచారు.
అనంతరం బాలిక తల్లి తండ్రులు నిజాంపేట పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుపై మాత్రం నోరు మెదపడం లేదు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.