సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (21:49 IST)

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఇవే...

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 37,857 కరోనా పరీక్షలు నిర్వహించగా, 176 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 
 
అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 53 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 14, వరంగల్ అర్బన్ జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
 
అదే సమయంలో 216 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,67,334 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,59,043 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,365 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,926కి పెరిగింది.
 
అలాగే, ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 643 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 145 కేసులు నమోదు కాగా... అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 8 మంది మృతి చెందారు. 839 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. 
 
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,55,306కి చేరుకుంది. మొత్తం 20,32,520 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14,236 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోగా ప్రస్తుతం 8,550 యాక్టివ్ కేసులు ఉన్నాయి.