1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana CM KCR Focus on Delhi Politics

ఉపరాష్ట్రపతిగా కేసీఆర్ - తెలంగాణ సీఎంగా కేటీఆర్ (video)

Telangana
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో సరికొత్త ఊహాగానాలు చెలరేగుతున్నాయి. భారత ఉపరాష్ట్రపతిగా తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ నియమితులుకాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో తన ప్రసంగంలో కేంద్ర రాజకీయాలు తెరాస ప్రమేయంపైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన గత నెలలో రెండుసార్లు ఢిల్లీ యాత్ర చేశారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ సిద్దం అవుతోంది. 
 
జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్న విషయం గత సార్వత్రిక ఎన్నికలకు ముందే స్పష్టమైంది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 
 
అయితే, అది థర్డ్ ప్రంట్ అనో.. మరొకటో కాదని తేల్చి చెప్పారు. అయితే, కేంద్రంలో తిరిగి పూర్తి మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటంతో కేసీఆర్ ఆలోచనలు ఆచరణలోకి రాలేదు.
 
ఇక, రెండోసారి సీఎంగా అయిన తర్వాత కొద్ది కాలంగా ఆయన వ్యవహారశైలిలో మార్పు కనిపిస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం పరంగా వరుసగా వరాలు ప్రకటిస్తున్నారు. ఇదేసమయంలో ఢిల్లీ రాజకీయాలపైన కన్ను వేశారు.  
 
About Writer
ఠాగూర్