సంబంధిత వార్తలు
- చైత్ర ఘటన.. పవర్ పరామర్శ.. షర్మిల దీక్ష.. దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ర్యాలీ..
- ఆరేళ్ళ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించనున్న పవన్ కళ్యాణ్
- క్యాప్, జుత్తుకు పిలక, రబ్బర్ బ్యాండ్... సింగరేణి నిందితుని వివరాలివి
- విజయవాడ వాంబే కాలనీలో మినీ బప్‌స్టేషన్
- ప్రశ్నిస్తే తిరిగి వారిపై బెదిరింపులు చేపట్టిన చిత్రపురి సొసైటీ
కాలనీలోకే బస్సు : తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం
దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది. ఒకే ప్రాంతం, లేదంటే ఒకే కాలనీ నుంచి ఊర్లకు వెళ్లే ప్రయాణికులు 30 మంది, అంతకుమించి ఉంటే సమీపంలోని డిపో నుంచి బస్సును బుక్ చేసుకోచ్చు.
అలా బుక్ చేసుకునే బస్సులు నేరుగా కాలనీ లేదా ప్రాంతానికి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుంటుందని ఆర్టీసీ తెలిపింది. ఈ సదుపాయం బుధవారం నుంచి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌లు వెల్లడించారు.
అలాగే, దసరా పండుగను పురస్కరించుకుని నడిపే ప్రత్యేక బస్సులు, వాటి ధరలు, సమయం, ఇతర వివరాల కోసం ఆయా బస్ స్టేషన్లను సంప్రదించాలని సూచించారు.
ఎంజీబీఎస్‌ను 99592 26257, జూబ్లీ బస్ స్టేషన్‌ను 99592 26264, రెతిఫైల్ బస్‌స్టేషన్‌ను 99592 26154, కోఠి బస్‌స్టేషన్‌ను 99592 26160 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. దసరా నేపథ్యంలో నగరం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
తర్వాతి కథనం