శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (22:30 IST)

విజ‌య‌వాడ వాంబే కాల‌నీలో మినీ బ‌ప్‌స్టేష‌న్

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని వాంబేకాల‌నీలో రెండెక‌రాల స్థ‌లంలో మినీ బ‌స్‌స్టేష‌న్ నిర్మాణంపై ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ పీహెచ్ ద్వారకా తిరుమలరావుతో న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ గురువారం ఆర్టీసీ భ‌వ‌న్‌లో స‌మావేశమ‌య్యారు. 

సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అవ‌స‌రాల నిమిత్తం ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు విన‌తి మేర‌కు  వాంబే కాల‌నీలో మినీ బ‌స్‌స్టేష‌న్  నిర్మాణం చేప‌ట్టాల‌ని గ‌తంలో న‌గ‌ర పాల‌క సంస్థ కౌన్సిల్ తీర్మానం చేయ‌డం జ‌రిగిన విష‌యం విధిత‌మే.