1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , మంగళవారం, 31 ఆగస్టు 2021 (15:11 IST)

వి.ఎం.సి. ఆధ్వ‌ర్యంలో సింగ్ న‌గ‌ర్లో సేవ‌లందిస్తున్న వృధాశ్రమం

సాధార‌ణంగా వృధాశ్రమాల‌ను దాత‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు నిర్వ‌హిస్తాయి. కానీ, ఘ‌న‌త వ‌హించిన విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ సొంతంగా ఓ అనాధ వృద్ధాశ్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. 
 
విజ‌య‌వాడ న‌గ‌రంలో అనాధలైన‌, నిరాద‌రణకు గురైన వృద్దులను గుర్తించి సింగ్ న‌గ‌ర్ న‌గ‌ర పాల‌క సంస్థ  వృధాశ్రమంలో వారికి సంర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న‌ట్లు న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ తెలిపారు. క‌మిష‌న‌ర్ అదేశాల మేర‌కు  శానిటరీ సూపర్ వైజర్ ఆర్‌. ఓబేశ్వరరావు, సలీమ్ అహ్మద్, శానిటరీ ఇన్స్పెక్టర్ సురేంద్ర  న‌గ‌రంలో ప‌ర్య‌టించి వ‌న్ టౌన్‌లో నిరాద‌రణకు గురైన 8 మంది వృద్దుల‌కు గుర్తించి తీసుకువ‌చ్చారు. వారికి అర్భ‌న్ హెల్త్ సెంట‌ర్ లో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, సింగ్ న‌గ‌ర్ లో రాజీవ్ న‌గ‌ర్‌ వృధాశ్రమంలో ఆశ్ర‌యం క‌ల్పించారు. 
 
పూర్తి  ఆహ్లదకరమైన వాత‌వ‌ర‌ణంలో ఈ వృద్ధాశ్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. వృద్దులకు ఈ వయస్సుల్లో తమ ఇంట్లో ఉండాల్సిన వసతులను ఇక్క‌డ కూడా కల్పించడంతో పాటు, వైద్య సేవ‌ల‌ను కూడా అందిస్తున్న‌ట్లు న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ తెలిపారు.  అనాధ, నిరాద‌రణకు గురైన వృద్దుల స‌మాచారాన్ని +91 98665 14199  తెలియ‌జేయాల‌న్నారు.