బుధవారం, 1 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2025 (11:29 IST)

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Hari Hara Veera Mallu OTT poster
Hari Hara Veera Mallu OTT poster
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఎ.ఎం. రత్నం నిర్మించిన ఈ సినిమా అనుకున్నట్లుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీనిని రెండు భాగాలుగా రాబోతుందని ముగింపు చూస్తే అర్థమవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దానిని తీసే ఆలోచన లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాకు అనుకున్నంతగా రాకపోవడంతో ఓటీటీలో కొంత సేఫ్ అనే ఆలోచనలో నిర్మాత వున్నారు.
 
రూల్స్ ప్రకారం అటు ఇటుగా ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసేసింది చిత్ర యూనిట్. అందుకే పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు  అంటూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం ఒక్క కన్నడ మినహా మిగతా భాషల్లో అందుబాటులోకి వచ్చింది. క్లైమాక్స్ ని కూడా అసుర హననం సాంగ్ తోనే ఎండ్ చేసేసారు. బాబీ డియోల్, పవన్ కళ్యాణ్ పై సన్నివేశాన్ని కూడా తొలగించారు.