శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 28 ఆగస్టు 2021 (18:26 IST)

న‌గ‌రికి కొత్త మున్సిపల్ ఆఫీస్ క‌ట్టిద్దాం: ఎమ్మెల్యే రోజా

చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. స‌భ‌లో ఆమెమాట్లాడుతూ, నగరిలో అర్ టీ సి బస్ స్టాండ్ లేక ప్రజలు అనేక ఇబందులు ప‌డుతున్నార‌ని, అలాగే మున్సిపల్ ఆఫీస్ చాల‌క చాలా  ఇబందికరంగా ఉంద‌న్నారు. న‌గ‌రి మున్సిపల్ ఆఫీస్ విశాల‌మైన చోట నిర్మించాలని సంక‌ల్పిoచామ‌ని ఎమ్మెల్యే చెప్పారు. 
 
నిండ్ర మండలం అత్తూరులో రూ.28 లక్షల వ్యయంతో నాడు నేడు పథకం కింద ఆధునికీకరించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

కే.ఆర్.పాళెంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిసనర్. మున్సిపల్ చైర్మన్ లు వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.