రోజాకు సజ్జల ఫోన్, ఇక ఆ పదవి రావడమే ఆలస్యమా?
ఉన్న ఎపిఐఐసి ఛైర్ పర్సన్ పదవి పోయింది. మంత్రి పదవి అస్సలు రాదు. ఇప్పట్లో నామినేటెడ్ పదవి ఉండబోదు. కేవలం ఎమ్మెల్యేగానే ఆమె ఉండాలి. ప్రారంభోత్సవాలు చేసుకోవాలి. హడావిడి చేయాలే తప్ప ఉపయోగమేమీ ఉండదని రోజా వ్యతిరేకుల బాగా ప్రచారం చేస్తున్నారు.
తాజాగా ఎపి సిఎం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో రోజాకి ఉన్న పదవి కాస్త పోయింది. దీంతో ఆమెకు మంత్రి పదవి వస్తుందని... ఆమె సన్నిహితులు భావిస్తే, ఇక రోజా పనైపోయిందని వ్యతిరేకులు ప్రచారం ప్రారంభించారు. కానీ రోజా మాత్రం ఎలాంటి విమర్సలకు, ఆరోపణలు, జరుగుతున్న ప్రచారంపై స్పందించలేదు.
తన సొంత నియోజకవర్గం నగరి, పుత్తూరు నియోజకవర్గాల్లో బిజీబిజీగా పర్యటిస్తూ అభివృద్థి కార్యక్రమాలకు భూమి పూజ, శంఖుస్థాపనలు చేస్తూ.. పూర్తయిన వాటిని ప్రారంభిస్తూ ముందుకు సాగుతోంది. తన నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటోంది రోజా.
తాజాగా రోజాకు స్వయంగా సజ్జల రామక్రిష్ణారెడ్డికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి రేసులో మీరున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్ళారట. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డి వైసిపి ప్రభుత్వంలో కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజాకు సజ్జల ఫోన్ చేయడంతో ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారట. ఇక ఎవరెన్ని మాట్లాడుకున్నా రోజాకు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు.