సంబంధిత వార్తలు
- పెగాసెస్ ఎఫెక్ట్.. Windows and Apple యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- అర్కైవ్ అనే ఆప్షన్‌కు కొత్త ఫీచర్‌ను జోడించిన వాట్సాప్
- Battlegrounds Mobile India రికార్డ్.. గూగుల్ ప్లేస్టోర్‌లో 3కోట్ల 40లక్షల యూజర్లు
- వినియోగదారులపై బలవంతంగా రుద్దబోం : హైకోర్టుకు వాట్సాప్ వినతి
- క్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంలో లోపం - యూజర్లకు హెచ్చరిక
కెమెరా ఆన్ మొబైల్ పేరుతో జియో అద్భుతమైన ఫీచర్
Jio
గతంలో జియోకాల్ పేరుతో ఉన్న యాప్ జియోజాయిన్‌గా మారింది. జియోజాయిన్ యాప్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్‌లు ఉన్నవారు ఈ యాప్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ యాప్ ఉపయోగించి జియోఫైబర్‌వాయిస్ ద్వారా వీడియో కాల్స్ చేయొచ్చు.
జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు లభించే కాలింగ్ సపోర్ట్ ఇది. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కెమెరా వెబ్‌క్యామ్‌లాగా పనిచేస్తుంది. టీవీలో వీడియో కనిపిస్తుంది. 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్‌ను చాలాకాలంగా టెస్ట్ చేస్తోంది జియోఫైబర్. ఈ ఫీచర్ సక్సెస్ కావడంతో యూజర్లకు రిలీజ్ చేసింది.
స్మార్‌ఫోన్‌లోని కెమెరాను ఉపయోగించి టీవీ ద్వారా వీడియో కాల్స్ చేయడానికి ముందుగా 10 అంకెల జియోఫైబర్ నెంబర్‌ను జియోజాయిన్ యాప్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జియోజాయిన్ యాప్ సెట్టింగ్స్‌లో 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్ ఎనేబుల్ చేయాలి.
ఇక మీరు మీ టీవీ నుంచి వీడియో కాల్స్ చేయొచ్చు. వీడియో కాల్స్ క్లారిటీ బాగా ఉండటానికి మోడెమ్‌లో 5GHz వైఫై బ్యాండ్ ఆన్ చేయాలి. 2.4GHz బ్యాండ్‌లో కూడా వీడియో కాల్స్ చేయొచ్చు. జియోజాయిన్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు.
