ఆఫ్గన్‌పై పట్టు బిగించిన తాలిబన్లు.. మళ్లీ తాలిబన్ల పాలన
ఆఫ్గన్‌పై తాలిబన్లు పట్టు బిగించారు. తాలిబన్లకు, ఆఫ్ఘన్ సైన్యానికి మధ్య గత కొన్ని రోజులుగా భీకర పోరు జరుగుతుంది. నాటో దళాలు, అమెరికా సైన్యం ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడంతో తాలిబన్‌లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని కీలకమైన ప్రాంతాలను సొంతం చేసుకున్నారు. కాందహార్‌తో పాటు, మూడో అతిపెద్ద కీలక నగరమైన హెరాత్‌ను కూడా తాలిబన్లు తమ ఆదీనంలోకి తీసుకున్నారు.
మరికొన్ని రోజుల్లో రాజధాని కాబుల్‌ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను తాలిబన్ నేతల ముందుకు తీసుకొచ్చింది. తాలిబన్లతో కలిసి అధికారం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఈ ప్రతిపాదనలను మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్ ముందు ఉంచింది ఆఫ్ఘన్ ప్రభుత్వం. మరి తాలిబన్లు దీనికి ఒప్పుకుంటారా లేదా చూడాలి.
కాగా.. దేశంలో ఇస్లామిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది తాలిబన్ల లక్ష్యం. మహిళలకు ఓటు హక్కు, ఇతర రంగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ యావత్ దేశాన్ని తమ గుప్పిట్లో తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో గత కొన్నేండ్లుగా ప్రభుత్వ బలగాలు, తాలిబన్ల మధ్య భీకర పోరాటాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడానికి ఖతార్‌లోని దోహాలో గత సెప్టెంబర్‌లో చర్చలు జరిగినప్పటికీ ఫలప్రదంకాలేదు.