మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (10:59 IST)

దేశంలో కొత్తగా మరో 40 వేల పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా మరో 40 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే అంశంపై కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ఒక మీడియా బులిటెన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 40,120 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,17,826కు చేరింది. అలాగే నిన్న క‌రోనా నుంచి 42,295 మంది కోలుకున్నారు.
 
ఇక కోవిడ్ మృతుల సంఖ్యను పరిశీలిస్తే, గురువారం రోజు 585 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,30,254కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,13,02,345 మంది కోలుకున్నారు. 
 
ప్రస్తుతం 3,85,227 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. నిన్న 57,31,574 వ్యాక్సిన్ డోసులు వేశారు. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 52,95,82,956 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.