సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (10:55 IST)

దేశంలో ఏమాత్రం తగ్గని కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ మేరకు గడిచిన 24 గంటల్లో 35,499 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. వీటితో కలుపుకుని దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,19,69,954కు చేరింది.
 
ఇక మరణాల విషయానికొస్తే... నిన్న 447 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,28,309కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,11,39,457 మంది కోలుకున్నారు. 
 
4,02,188 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 50,86,64,759 వ్యాక్సిన్ డోసులు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు. రిక‌వ‌రీ రేటు 97.40 శాతంగా ఉంది.
 
ఇకపోతే, ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.40 శాతానికి చేరుకుందని, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.26శాతం ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.35శాతంగా ఉందని, రోజువారి పాజిటివిటీ రేటు 2.59శాతంగా ఉందని వివరించింది.