మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (20:18 IST)

అంతర్జాతీయ వేదికపై జాతీయ గీతం.. నెట్టింట వీడియో వైరల్ (video)

NeerajChopra
భారత్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిచి భారత్‌ త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించారు. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో 13 ఏళ్ల తర్వాత భారత జాతీయ గీతాన్ని వినిపించారు.

2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో బంగారు పతకం సాధించినపుడు భారత జాతీయ గీతాన్ని వినిపించగా.. మళ్లీ ఇన్నేళ్లకు నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించడంతో జాతీయ గీతాన్ని వినిపించారు. 
 
ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన గంట వ్యవధిలోనే లక్షకు పైగా నెటిజనులు వీక్షించారు. అంతేకాకుండా నీరజ్‌ చోప్రాకు సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తూ.. అభినందనలు తెలుపుతున్నారు.
 
కాగా మొదటి ప్రయత్నంలో చోప్రా జావెలిన్‌ను 87.03 మీటర్లకు విసిరారు. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లకు విసిరారు. కాగా రెండో స్థానంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన వడ్లెక్ నిలిచారు.