లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ "లిటిల్ హార్ట్స్" మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కంటెంట్ నచ్చి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం నుంచి రాజా గాడికి సాంగ్ లాంఛ్ చేశారు.
ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ, ప్రేక్షకుల్ని బాగా నవ్వించే మూవీస్ చేయాలని నేను కోరుకుంటాను. అలా ఈ సినిమా చూస్తున్నంత సేపూ నేనూ బాగా ఎంజాయ్ చేశాను. సెప్టెంబర్ 12న థియేటర్స్ లో ఈ సినిమా చూసే ప్రేక్షకులు సీట్ల మీద నుంచి కింద పడేలా నవ్వుకుంటారు. నేను వంశీ కలిసి నాలుగు చిత్రాలు చేశాం. నాలుగూ సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు సాయి మార్తండ్ ఎంతో సహజంగా తెరకెక్కించాడు.
మన కాలేజ్ డేస్ లోని ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి. ఎక్కడా డ్రామా క్రియేట్ చేయకుండా హీరో క్యారెక్టర్ తో ఎంత మాట్లాడించాలో, ఎలా మాడ్లాడించాలో అంతే చెప్పించాడు. కొత్త దర్శకుడిగా ఇంత బాగా మూవీ చేయడం అభినందనీయం. మౌళి నాచురల్ యాక్టర్. అతడిని చూస్తే మనం బయట చూసే కాలేజ్ అబ్బాయిలాగే ఉంటాడు. అలాగే పర్ ఫార్మ్ చేస్తాడు. శివానీ బాగా నటించింది. ఈ సినిమాను కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఫ్రీ షోస్ వేయాలనుకుంటున్నాం. సోషల్ మీడియా వాళ్లకైతే కావాల్సినంత స్టఫ్ ఈ మూవీ ద్వారా దొరుకుతుంది. సింజిత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ, మా మూవీని థియేట్రికల్ రిలీజ్ కు వంశీ నందిపాటి, బన్నీ వాస్ గారు తీసుకొస్తుండటం హ్యాపీగా ఉంది. ఆదిత్య హాసన్ అన్న మరో మంచి మూవీ ప్రొడ్యూస్ చేశారు. మౌళి, నా ఫ్రెండ్, అతను హీరోగా నేను మ్యూజిక్ చేస్తానని అనుకోలేదు. శివానీ కూడా నాకు ఫ్రెండ్. మా అందరి కాంబోలో మూవీ రావడం సంతోషంగా ఉంది. అన్నారు.
హీరోయిన్ శివానీ నాగరం మాట్లాడుతూ, ఈ సినిమాలో మౌళితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆదిత్య హాసన్ గారికి "లిటిల్ హార్ట్స్" మరో మంచి సక్సెస్ ఫుల్ మూవీ అవుతుంది. మా మూవీని థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నందుకు వంశీ గారికి, బన్నీ వాస్ గారికి థ్యాంక్స్. ఈ పాటను మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ - "లిటిల్ హార్ట్స్" చాలా ఎంటర్ టైనింగ్ గా ఎగ్జైటింగ్ గా ఉండే మూవీ. ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొస్తున్నందుకు వంశీ, బన్నీ వాస్ గారికి థ్యాంక్స్. వాళ్లు సినిమా తీసుకోవడమే కాదు మూవీలో ఏమేం నచ్చాయో మమ్మల్ని పిలిచి మరీ చెప్పారు. అంత ప్యాషన్ ఉంది కాబట్టే సక్సెస్ ఫుల్ మూవీస్ చేయగలుగుతున్నారు అనిపించింది. ఈటీవీ విన్ నుంచి సాయి కృష్ణ, నితిన్ గారు చాలా సపోర్ట్ చేశారు. మా ఆదిత్య హాసన్ కు ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. ఈ మూవీ కోసం సాయి మార్తండ్ తో పాటు మేమంతా ఎగ్జైటింగ్ కంటెంట్ తీసుకురావాలని బాగా ప్రయత్నించాం. శివానీ తో కలిసి నటించడం వల్ల నా కాన్ఫిడెంట్ పెరిగింది. నా ఫ్రెండ్ సింజిత్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రాజా గాడికి సాంగ్ మీకు బాగా నచ్చుతుంది. అన్నారు.
ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ మాట్లాడుతూ, ఫుటేజ్ చూస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ గా చాలా సంతృప్తి పడ్డాను. నేనొక దర్శకుడిగా చేసే సినిమా కంటెంట్ కూడా నా ప్రొడ్యూసర్ ను అలా సంతృప్తి పరచాలని అనిపించింది. ఈ చిత్ర ట్యాగ్ లైన్ లాగే హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ దాకా మీరు కథతో రిలేట్ అవుతారు. 2 గంటలు ఫుల్ ఎంటర్ టైన్ అవుతారు అన్నారు.