శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (10:07 IST)

దేశంలో మళ్లీ ఉధృతి : 24 గంటల్లో 41 వేల పాజిటివ్ కేసులు

దేశంలో మళ్లీ కరోనా వైరస్ ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,195 కేసులు నమోదయ్యాయి. వైరస్ నుంచి 39,069 మంది బాధితులు కోలుకోగా.. మరో 490 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 
 
కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,20,77,706కు చేరింది. ఇందులో మొత్తం 3,12,60,050 మంది డిశ్చార్జి అయ్యారు. అలాగే, మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 4,29,669 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. 
 
ఇకపోతే, దేశంలో 3,87,987 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.21శాతంగా ఉందని పేర్కొంది. రికవరీ రేటు 97.45 శాతానికి చేరుకుందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.94 శాతంగా ఉందని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా 52.36 డోసులు పంపిణీ చేశామని వెల్లడించింది.