ఓ రాత్రికి రేటెంత? సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేసిన రేణూ దేశాయ్
ఓ రాత్రికి రేటు ఎంత అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు పోకిరీలు అడిగిన ప్రశ్నకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో కొంతమంది అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొంతకాలంగా కొంతమంది నెటిజన్లు సామాజిక మాధ్యాల్లో పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా తనపై కామెంట్లు పెడుతున్న నాలుగు సోషల్ మీడియా ఖాతాలపై ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రేణూ దేశాయ్ మహిళలు, చిన్నారులు, మూగజీవుల రక్షణపై తన అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో నిత్యం పంచుకుంటున్నాం. ముఖ్యంగా, ఇటీవలశునకాల గురించి ఆమె కొన్ని రోజుల క్రితం పెట్టిన ప్రెస్మీట్‌పై పలువురు నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. వీధి కుక్కల దాడులపై తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొందరు నెటిజన్లు హద్దుమీరారని ఆమె ఆరోపించారు.