గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (13:06 IST)

ప్రముఖ మలయాళీ నటి మృతి : కాటేసిన కేన్సర్ - కరోనా

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అనేక మంది సినీ సెలెబ్రిటీలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కోల్పోతూనేవున్నారు. తాజా మరో యువ నటి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప‌దేళ్లుగా క్యాన్స‌ర్‌తో పోరాడుతూ వచ్చిన మలయాళ నటి శరణ్య శశి (35). ఈమెకు ఇటీవల కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెను ఈ నెల 9వ తేదీన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లారు. 
 
క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.. ఒకటీ రెండు కాదు, ఏకంగా 10ఏళ్లపాటు మహమ్మారితో తలపడింది. అలాంటి ఆమెను కరోనా సైతం వదల్లేదు. కరోనా నుండి కోలుకుంటుంది అనుకునే లోపు ఆమెకు ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడాయి. 
 
న్యుమోనియాతో పాటు రక్తంలో సోడియం స్థాయిలు పడిపోవడంతో ప్రైవేట్ ఆసుప‌త్రిలో క‌న్నుమూసింది. మంత్రకోడి, సీత మరియు హరిచందనం సహా పలు మలయాళ టీవీ సిరియల్స్‌తో బాగా పాపులర్‌ అయిన శరణ్య పలు సినిమాల్లో సహాయక పాత్రలను కూడా పోషించింది.ఆమె మృతికి ప‌ల‌వురు ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు.