శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (12:00 IST)

తాలిబన్ల ఆధీనంలో కాందహార్ నగరం

ఆప్ఘనిస్థాన్ దేశంలోని కీలక నగరాల్లో ఒకటైన కాందహార్ నగరం కూడా తాలిబన్ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ దేశంలోని రెండో అతిపెద్ద నగరంగా కాందహార్ వుంది. కాగా, ఇప్పటికే పలు నగరాలను తమ కైవసం చేసుకున్న తాలిబన్లు.. పాకిస్థాన్ సైన్యం అండతో రెచ్చిపోతున్నారు. ఫలితంగా తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. 
 
ఇప్పటికే ఆ దేశంలోని పలు నగరాలను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. తాజాగా కాందహార్‌ను తమ నియంత్రణలో పెట్టుకున్నారు. అఫ్గానిస్థాన్‌లో రాజధాని కాబూల్‌ తర్వాత అతిపెద్ద నగరం కాందహార్‌. అఫ్గాన్‌లోని సగ భాగం ఇప్పటికే తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. 
 
ఈ నేపథ్యంలో తాలిబన్లతో అధికారం పంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. హింసను పక్కనపెడితే సయోధ్యకు సిద్ధమని ప్రతిపాదన పంపింది. ఆ ప్రతిపాదనపై తాలిబన్ల ప్రతిస్పందన కోసం అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వం నిరీక్షిస్తోంది.