మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (21:38 IST)

భారత్‌తో చర్చలకు కూర్చుంటాం.. తాలిబన్ స్పష్టం

భారత్‌తో ఇప్పటివరకూ ఎటువంటి చర్చలూ జరపలేదని తాలిబన్‌లు స్పష్టం చేశారు. అంతేకాకుండా.. చర్చలు నిష్పాక్షికంగా జరుగుతాయంటేనే తాము భారత్‌తో చర్చలకు కూర్చుంటామని తేల్చి చెప్పారు. ఈ మేరకు తాలిబన్‌ల అధికార ప్రతినిధి మహ్మద్ సొహెయిల్ షాహీన్.. ఓ జాతీయ చానల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
అంతేకాకుండా..అఫ్గానిస్థాన్ గడ్డపై నుంచి మరో దేశంపై దాడులు చేసేందుకు ఏ వ్యక్తిని, లేదా సంస్థను అనుమతించబోమని కూడా సోహెయిల్ స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అష్రాఫ్ ఘానీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పిన ఆయన.. ఘానీ ప్రభుత్వానికి తామెన్నటికీ లొంగమని పేర్కొన్నారు.