గురువారం, 18 జులై 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (12:46 IST)

వివాదంలో చిక్కుకున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్

Vinesh Phogat
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ వివాదంలో చిక్కుకుంది. రెజ్లింగ్ సమాఖ్య ఆమెకు నోటీసులు ఇచ్చింది. తాత్కాలిక నిషేధం విధించిన రెజ్లింగ్ సమాఖ్య 16 లోగా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఒలింపిక్స్‌కు రెడీ అయ్యేందుకు హంగేరీ వెళ్లిన వినేశ్ ఫోగాట్ అట్నుంచి అటే టోక్యో చేరుకుంది. ఇతర రెజ్లర్లు భారత్ నుంచి టోక్యో వెళ్లారు. ఒలింపిక్స్ క్రీడా విలేజ్‌లో వారితో కలిసి ఉండేందుకు వినేశ్ ఫోగాట్ నిరాకరించింది.
 
తాను హంగేరీ నుంచి వచ్చానని, భారత్ నుంచి వచ్చే వారి నుంచి కరోనా సోకే అవకాశాలు ఉన్నాయన్నది వినేశ్ వాదన. వారితో కలిసి ప్రాక్టీసు కూడా చేయలేదట. మ్యాచ్‌లలో అధికారిక స్పాన్సర్ కిట్లను కూడా ధరించలేదని భారత రెజ్లింగ్ సమాఖ్య ఆమెపై ఆరోపణలు చేసింది. భారత్ తిరిగొచ్చిన వినేశ్ కు రెజ్లింగ్ సమాఖ్య నోటీసులు ఇచ్చింది. ఆమె పై తాత్కాలిక నిషేధం విధించింది. 16 లోగా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.