ప్రశ్నిస్తే తిరిగి వారిపై బెదిరింపులు చేపట్టిన చిత్రపురి సొసైటీ
సినిమారంగంలోని కార్మికుల కోసం కట్టిన చిత్రపురి కాలనీలోని హౌసింగ్ సొసైటీ కమిటీ కోట్ల రూపాయలు మింగేసిందని చిత్రపురి సాధన సమితి కేసువేసిన సంగతి తెలిసిందే. అందుకు ఫలితంగా 51 రిపోర్ట్ కూడా వచ్చింది. అయితే అందులో చాలాభాగం అవినీతి జరిగిందని ప్రభుత్వం నివేదిక అందజేసింది. ఈ విషయాలను తెలియజేయడానికి ఆదివారంనాడు నానక్‌రామాగూడాలోని చిత్రపురి కాలనీ సర్వసభ్య సమావేశం జరిగింది. కానీ ఆ సమావేశంలో అసలు సభ్యులుకంటే పెయిడ్ సభ్యులు హాజరయ్యారు. ఇందుకు కారణమైన ప్రస్తుత అధ్యక్షుడు అనిల్ వల్లభనేనిని పోరాట సమితి నిలదీసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. మీటింగ్ హాజరైన పోలీసులు, గూండాలతో ప్రశ్నించినవారిని భయపెట్టడం విశేషం.
గత కొన్నేళ్ళుగా చిత్రపురి కాలనీలో 1,2,3, డ్యూబ్లక్స్, రో.. హౌస్‌ల ఇళ్ళు కట్టించి ఇవ్వాల్సిన బాధత్య సొసైటీకి వుంది. కానీ ఇప్పటివరకు 1,3 మినహా ఏవీ కొలిక్కిరాలేదు. ఈలోగానే వందలకోట్లకు పైగా అవినీతి జరిగింది. దీనిపై పోరాటసమితి చట్టపరంగా పోరాడుతుంది. ఈ నేపథ్యంలో ఆదివారంనాడు జరిగిన సర్వసభ్య సమావేశంలో సీనియర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సీనియర్ రచయిత జొన్నవిత్తల రామలింగేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, చిత్రపురి సొసైటీ కమిటీ సభ్యులు చేస్తున్న ఆగడాలను ప్రశ్నించారు. అసలు మీ ఎన్నిక సరైంది కాదు. దీనికి కొలమానం ఏమిటి? డబ్బుతో అధికారులను కొనేసి గెలిచినట్లు ప్రకటించుకున్నారని వారిని నిలదీశారు. ఈయన అడిగిన దానికి చాలామంది కరతాళ ధ్వనులతో వత్తాసు పలికారు. అలాగే మరికొంతమంది అవినీతిపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
ఇవన్నీ విన్న సొసైటీ నాయకుడు అనిల్ ప్రశ్నించినవారిపై అంభాడాలు వేశారు. అసలు సమావేశం కేవలం 51 ఎంక్లయిరీ గురించే మాట్లాడాలి. మిగిలిన విషయాలు మాట్లాడకండి. వయస్సులో పెద్దవారు ఏదైనా అంటే మీరు ఏమవుతారో ఆలోచించుకోండని ధ్వజమెత్తారు. అనంతరం అనిల్ చెప్పినదానికి కమిటీ సభ్యులంతా వత్తాసుపడారు. కానీ ఓ విషయానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. జనరల్‌బాడీ సమావేశానికి చిత్రపురిలో సభ్యులు మాత్రమే హాజరుకావాలి. కానీ నాన్ మెంబర్లు, జూనియర్ ఆర్టిస్టులను అనిల్ తీసుకువచ్చి సమస్యను తప్పుదోవ పట్టించాడని పోరాట సమితి అధ్యక్షుడు కస్తూరి శ్రీనివాస్ నిలదీశారు.
అక్కడే వున్న సినీ పెద్దలు ఏమీ మాట్లాడలేకపోయారు. కారణం ప్రతిదానికి పోలీసులు కూర్చోమని అడ్డుకోవడమే కారణం. ఇలా బెదిరించి సభ్యులుకానివారితో అజెండాలోని విషయాలను అనిల్ చెప్పినట్లు చేయగలిగాడు. దాంతో పోరాటసమితి ఎన్నిసార్లు సభ్యులుకానీ వారు ఎందుకు ఇక్కడకు వచ్చారనేదానికి అనిల్ సరైన సమాధానం ఇవ్వకుండా. గట్టిగా ఫోన్‌లో అరుస్తూ, సభ్యులుకానివారుంటే వెళ్ళిపోండని పైపై మాటలు మాట్లాడారు. సభ్యులుకానివారికి ఒక్కోక్కరికి 500 రూపాయలు, బిర్యానీ పాకెట్, మందు ఏర్పాట్లు చేసినట్లు కస్తూరి శ్రీను ఆరోపించారు. అందుకే సోమవారంనాడు పోరాటసమితి `న్యాయ పోరాట దీక్ష` పేరుతో దీక్ష ఆరంభించింది. ఇందుకు పలురాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఈ కుంభకోణంలో అధికార పార్టీ నాయకులకు వాటా వుందని కస్తూరి ఆరోపించారు. ఇదీ సినిమా కార్మికుల దుస్తితి.