చిత్రపురి కాలనీ సొసైటీలో 99కోట్ల గోల్‌మాల్ నిజమేనని తేల్చిన విచారణకమిటీ
సినీ కార్మికుల స్వంత ఇల్లు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో నెలకొల్పిన సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో 99 కోట్లు గోల్‌మాల్ అయిన వాట వాస్తమేనని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తేల్చింది. గత కొన్ని సంవత్సరాలు దీనిపై కార్మిక సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటీవలే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అక్రమాలు నిజమేనని తేల్చిచెప్పింది.
2015 నుంచి 2020 వరకు వున్న సొసైటీ కమిటీ ఇందుకు బాధ్యత వహించాల్సివుంటుంది. నివేదిక ఆధారంగా సొసైటీకి నివేదిక ఇచ్చాం. వాటిని వారి జనరల్‌బాడీలో చర్చించి మాకు నెలరోజులలోపు సమాధాన ఇవ్వాల్సి వుంటుందని కో-ఆపరేటివ్ సొసైటీ కమీషనర్ ఎం. వీరబ్రహ్మయ్య తెలియజేశారు.
చిత్రపురిలో అసలు ఏం జరిగింది
హైదరాబాద్ నానక్‌రామ్‌గూడా పరిధిలోని కొండ ప్రాంతాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మానందరెడ్డి 60 ఎకరాలు కేటాయించారు. ఆ తర్వాత వై.ఎస్. హయాంలో కదలిక వచ్చింది. ఆ తర్వాత సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అనే కమిటీ ఏర్పాటైంది. సినీమారంగంలోని జూనియర్ ఆస్టిస్ట్ కోఆర్డినేటర్లు, నటులు, ఇతర శాఖలకుచెందిన 11మంది కమిటీగా ఏర్పడ్డారు. మొదటగా కొమరం వెంకటేష్ అధ్యక్షునిగా వున్నారు. అనిల్ వల్లభనేని కోశాధికారిగా వ్యవహించారు. ఇలా తలో బాధ్యతను తీసుకున్న వారు సినీమారంగంలోని 24 క్రాఫ్ట్ లకు చెందిన కార్మికులకు సభ్యతం ఇచ్చి ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేశారు. కానీ అందులో చాలా అవతకవకలు వున్నాయని కొంతకాలానికి సినీకార్మికుల యూనియన్‌లు సంబంధింత అధికారులకు విన్నవించారు. కానీ అవన్నీ బుట్టదాఖలయ్యాయి. ఆ తర్వాత పలు కోర్టు కేసులు కూడా జరిగాయి. దాదాపు పదేళ్ళకుపైగా కార్మికులంతా సంఘటితంగా పోరాటం చేస్తే ఇప్పటికి సంబంధిత యంత్రాంగం కదలికి వచ్చింది. అయితే ఇందులో రాజకీయనాయకుల ప్రమేయం కూడా వుందని, అందుకే సొసైటీ నాయకులు ధైర్యంగా అవినీతికి పాల్పడుతున్నారని పోరాట సమితి అధ్యక్షుడు కస్తూరి శ్రీనివాస్ తెలియజేశారు.
ఇప్పుడు ఏం జరుగుతోంది
అయితే ఇప్పటి సొసైటీ అధ్యక్షుడిగా వున్న అనిల్ వల్లభనేని, కార్యదర్శి కాదంబరి కిరణ్‌లు తమకు వచ్చిన నివేదిక పూర్తిగా లేదనీ అంటోంది. అప్పటికే ప్రముఖ ప్రతికలలో ప్రభుత్వ నివేదిక వచ్చింది వచ్చినట్లు ప్రచురితమైంది. కానీ అదంతా అసత్యమని తాము చెప్పేదే వినండని శుక్రవారంనాడు సొసైటీ కమిటీ లెటర్‌ద్వారా మీడియాకు తెలియజేసింది. ఆగస్టు 29న జనరల్ బాడీ ఏర్పాటు చేశామని, అందులోనే యాక్ట్ 51 ఎంక్వయిరీ రిపోర్ట్ వివరాలు సినీ కార్మికులకు తెలియజేస్తామని తెలియజేసింది.
దొంగలు తప్పించుకునే ప్రయత్నంః మద్దినేని రమేష్
కాగా, సొసైటీవారు మీడియాకు తెలియజేసిన లెటర్ సారాంశం బట్టి అది పూర్తి నివేదిక కాదు, సగం నివేదికే. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత నిజానిజాలు తెలుస్తాయి, అంతా సంయమనం పాటించాలని ఇచ్చిన ప్రెస్ నోట్ " దొంగే - దొంగ దొంగ " అని అరిచినట్లు వుంది. 1600 వందల మంది సభ్యులు చిత్రపురిలో డబ్బులు కట్టి కూడా ఈరోజు అద్దె ఇళ్లల్లో నానా బాధలు పడుతూ గడుపుతూ ఉండటం బాధాకరం. అంతే కాకుండా ప్రభుత్వ అధికారుల అలోట్మెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ అయినవి, అధికారికంగా లేని 7,8 అలాట్మెంట్స్ మరియు 5 A కింద ఎవరి సంతకాలు లేకుండా 250 పైన HIG త్రబుల్ బెడ్‌రూమ్స్) రిజిస్ట్రేషన్స్ రద్దు అయ్యే పరిస్థితి వుంది..రద్దు చేసినట్లే ఒక రకంగా.వాళ్ళ అందరికీ ఏమి సమాధానం చెప్తారు. అని నిలదీస్తున్నారు.
అందుకే వారంతా మీ ఇంటిమీదకు వస్తారని మోసం చేసినందుకు నిన్ను చుట్టు ముడతారని... కొత్తగా నాటకం ఆడతావా!?? సంయమనం పాటించామంటావా!?? వందలమంది ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ రద్దు చెయ్యమని నివేదికలో ఉంటే. ఆ వాస్తవాన్ని బయటకు రానీయకుండా నాటకాలు ఆడుతున్నావ్ యాక్ట్ 51 నివేదిక కేవలం ప్రాధమిక నివేదిక అంటావా!?? వాస్తవ నివేదికను తొక్కిపట్టి భయంతో ప్రెస్ నోట్ విడుదల చేయటం వెనుక వున్న భయం ఏంటో నీ - మీ చేతిలో మోసపోయిన వారికి, నీకు లక్షలు, కోట్లు ఇచ్చి ప్లాట్స్ కొన్న వారికి తెలియక పోవచ్చును. మాకు మొత్తం కథ తెలుసు - నివేదికలో ఏమున్నదో కూడా తెలుసు . త్వరలో చిత్రపురి చిత్రాలు - విచిత్రాలు చూస్తారు.. అంటూ పోరాట సమితి అధ్యక్షుడు కస్తూరి శ్రీనివాస్, ప్రజానాట్యమండలి ఫిల్మ్ డివిజన్ కార్యదర్శి మద్దినేని రమేష్ సొసటీ కి సవాల్ విసిరారు.