శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (10:00 IST)

క్లాస్‌పూర్ వద్ద విషాదం - లోయలో పడిన ఆర్టీసీ బస్సు

తెలంగాణ రాష్ట్రంలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. డిపో బస్సు కారును ఢీకొనడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన లోయలో పడిపోయింది. ఈ ఘటన బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్‌ వద్ద చోటుచేసుకుంది. 
 
బెల్లంపల్లి నుంచి హనుమకొండకు వెళుతున్న పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొని అదుపు తప్పి రోడ్డు పక్కన లోయలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఖాన్‌సాయిపేటకు చెందిన వినీత్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. 
 
బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాలు కాగా 16 మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.