1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (17:00 IST)

కేసీఆర్ గుడ్ న్యూస్: జోనల్ విధానంతో రాబోయే నెల రోజుల్లో..?

నిరుద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. కొత్తగా తీసుకువచ్చిన జోనల్ విధానంతో 95 శాతం స్థానికులకే దక్కుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఆయా జిల్లాల స్థానికులకే అవకాశం లభిస్తుందని తెలిపారు. 
 
ప్రస్తుత జోనల్ విధానంతో రాబోయే నెల రోజుల్లో ఉద్యోగుల విభజన జరిగిపోతుందని అన్నారు. ఆ తర్వాత ఏ జిల్లా వాళ్లకు అక్కడి ఉద్యోగులతో ఉద్యోగాలు భర్తీ జరుగుతుంది. దీని తర్వాత ఏజిల్లాకు ఎన్నిజాబులు వస్తున్నామనే వివరాలు వెల్లడవుతాయని తెలిపారు. 
 
ఖాళీల సమాచారం కూడా వెల్లడవుతుందని కేసీఆర్ అన్నారు. ఒకసారి లెక్కతేలిన తర్వాత రెండు  మూడు నెలల్లో ఉద్యోగ భర్తీ ప్రారంభిస్తామన్నారు. కనీసం 70-80వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు.