బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (11:42 IST)

హుజురాబాద్ బై పోల్ : ఇంటర్ పరీక్షల టైంటేబుల్‌ మార్పు

తెలంగాణ రాష్ట్రంలోని హుజు‌రా‌బాద్‌ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. 
 
అయితే, ఈ ఉప‌ఎ‌న్నిక నేప‌థ్యంలో ఇంటర్ పరీక్షల సమయ పట్టికలో మార్పు చోటుచేసుకోనున్నాయి. ఇంటర్‌ ఫస్టి‌యర్‌ పరీ‌క్షల టైంటే‌బు‌ల్‌లో స్వల్ప‌మా‌ర్పులు చేయా‌లని ఇంట‌ర్‌‌బోర్డు అధి‌కా‌రులు నిర్ణ‌యిం‌చారు.
 
ఇంటర్ బోర్డు ముందుగా ప్రక‌టిం‌చిన షెడ్యూ‌ల్‌లో రెండు రోజు‌ల‌పాటు పరీక్ష తేదీ‌లను మార్చ‌ను‌న్నారు. ప్రభుత్వ అనుమతి రాగానే.. ఒక‌ట్రెండు రోజుల్లో అధి‌కా‌రిక ప్రక‌టన చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
 
పరీ‌క్ష‌లను ఈ నెల 25 నుంచి నవం‌బర్‌ రెండు వరకు ఇంటర్‌ సెకం‌డి‌య‌ర్‌‌లోని విద్యా‌ర్థు‌లకు ఫస్టి‌యర్‌ పరీక్షలను నిర్వ‌హిం‌చేందుకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.