గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (17:50 IST)

ఐసీసీ టీ20 ప్రపంచ కప్: టీమిండియా జట్టు ఇదేనా?

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మరో నెల రోజుల్లో ఆరంభమవుతోంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టును బీసీసీఐ సెలక్టర్ల బృందం ఎంపిక చేసింది. నేడో రేపో జట్టును ప్రకటించనుంది. 
 
ఈ నేపథ్యంలో జట్టులో ఎవరుంటారనే వివరాలు బయటికి వచ్చాయి. ఆ జట్టులో కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, యుజ్వేంద్ర చాహల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌ ప్రపంచకప్‌ ప్రధాన జట్టులో ఉండే అవకాశం ఉంది. ఎవరైనా గాయపడితే రిజర్వుగా వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, పృథ్వీ షా, దీపక్‌ చాహర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణను ఎంపిక చేస్తారని సమాచారం.