శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (16:29 IST)

ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 కప్ : పాకిస్థాన్ జట్టు ఇదే..

ఐసీసీ నిర్వహించే మెగా ఈవెంట్లలో ట్వంటీ20 వరల్డ్ కప్ ఒకటి. ఈ ఈవెంట్ త్వరలో యూఏఈ వేదికగా జరుగనుంది. ఇందుకోసం దాయాదిదేశం పాకిస్థాన్ తన టీ20 జట్టును ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన జట్టును సోమవారం పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 
 
ఈ జట్టుకు స్టార్​ బ్యాట్స్​మన్​ బాబర్​ అజామ్​ నాయకత్వం వహించనున్నాడు. 15 మందితో కూడిన ఈ జట్టులో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌, సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కి చోటు దక్కకపోగా.. సీనియర్ ఓపెనర్ ఫకార్ జమాన్‌‌ని రిజర్వ్‌లో ఉంచారు. 
 
యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. గ్రూప్-2లో ఉన్న పాకిస్థాన్ తన ఫస్ట్ మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి భారత్‌తో అక్టోబరు 24న దుబాయ్‌ వేదికగా తలపడనుంది. వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకూ భారత్‌పై పాకిస్థాన్ గెలవలేదు.
 
పాక్ జట్టు సభ్యులు...
బాబర్ అజామ్ (కెప్టెన్), షదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, అజామ్ ఖాన్, హారీస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీమ్, కౌదిల్ షా, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హసనైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీమ్ జూనియర్, షాహీన్ అఫ్రిది, సోహెబ్ మక్సూద్‌.