శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (10:06 IST)

పహీ మచ్‌మచ్‌ను చంపేసిన కరోనా వైరస్

అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరుగాంచిన గ్యాంగ్‌స్టర్ ఫహీం మచ్‌మచ్‌ను కరోనా వైరస్ చంపేసింది. గత కొంతకాలంగా కరోనాతో బాధపడుతూ వచ్చిన ఆయన.. శనివారం రాత్రి ప్రాణాలు విడిచాడు. 
 
దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్‌తో కలిసి పాకిస్థాన్‌లో ఏళ్లుగా ఉంటున్నట్టు చెబుతున్న ఫహీం కరాచీలో మరణించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని, ఫహీం దక్షిణాఫ్రికాలో గుండెపోటుతో మరణించాడని చోటా షకీల్ పేర్కొన్నాడు. 
 
కాగా, మచ్‌మచ్‌పై అనే హత్యాయత్నం, హత్య, దోపిడీ వంటి కేసులు ఉన్నాయి. ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు ఫహీం మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. అంతేకాకుండా, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు అతడు నమ్మినబంటు. 
 
ముంబైలోని తన మనుషుల ద్వారా దావూద్‌ గ్యాంగ్‌కు పనులు చేసిపెడుతున్నట్టు సమాచారం. ఫహీం మృతి చెందినట్టు తమకూ సమాచారం అందిందని అయితే, ఈ విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉందని ముంబై క్రైం బ్రాంచ్ వర్గాలు పేర్కొన్నాయి.